: బ్రహ్మోత్సవాల అనంతరం టీటీడీ పాలకమండలి ఏర్పాటు
కాంగ్రెస్ హయాంలో కనుమూరి బాపిరాజు చైర్మన్ గా ఏర్పాటైన టీటీడీ పాలకమండలిని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రద్దు చేసిన సంగతి తెలిసిందే. నూతన పాలకమండలిని శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పాలకమండలిలో ఇద్దరు లేదా ముగ్గురు తెలంగాణ టీడీపీ నేతలకు కూడా స్థానం కల్పించాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక, టీటీడీ చైర్మన్ రేసులో చదలవాడ కృష్ణమూర్తి, రాయపాటి సాంబశివరావు, మురళీమోహన్, నటుడు శివాజీ తదితరులున్నారు.