: తమిళనాడు సీఎం రేసులో షీలా బాలకృష్ణన్?
జయలలిత సీఎం పీఠం దిగడంతో ఆమె వారసులెవరన్న విషయంపై ఆసక్తి నెలకొంది. మంత్రి పన్నీర్ సెల్వం పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా, ప్రభుత్వ సలహాదారు షీలా బాలకృష్ణన్ పేరు అనూహ్యంగా రేసులోకొచ్చింది. షీలా బాలకృష్ణన్ వాస్తవానికి అన్నా డీఎంకే సభ్యురాలు కారు. ఇంతకుముందు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. జయకు విశ్వాసపాత్రులని పేరుపడ్డారు. ప్రస్తుతం ఆమె ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.