: జయలలిత కోసం కుర్చీ తెచ్చిన మంత్రులు... అడ్డుకున్న అధికారులు
బెంగళూరు సెంట్రల్ జైలులో ఉన్న తమ అధినేత్రిని ఈ ఉదయం తమిళనాడు రాష్ట్ర మంత్రులు కలిశారు. ముగ్గురు మంత్రులు, జయ వ్యక్తిగత కార్యదర్శి ఆమెను కలిసి అల్పాహారం, తమిళ దినపత్రికలు అందించారు. కాగా, మంత్రులు తమతోపాటు జయలలిత వ్యక్తిగత కుర్చీని తీసుకురాగా, జైలు అధికారులు దాన్ని లోపలికి తీసుకువెళ్ళేందుకు అంగీకరించలేదు. జయలలిత ఎక్కడ పర్యటన జరిపినా, సిబ్బంది ఈ కుర్చీని కూడా తీసుకు వెళుతుండేవారు.