: డాక్టర్ నందమూరి తారకరామారావు ఆరోగ్యసేవ... ఇకపై 'ఆరోగ్యశ్రీ' పేరు ఇదే


ప్రభుత్వాలు మారినప్పుడల్లా పథకాల పేర్లు మారడం సహజం. ఈ క్రమంలో, ఆంధ్రప్రదేశ్ లో అమల్లో ఉన్న రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి టీడీపీ సర్కారు పునఃనామకరణం చేసింది. ఇకపై ఈ సేవలను 'డాక్టర్ నందమూరి తారకరామారావు ఆరోగ్యసేవ'గా పిలవనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న ఆరోగ్యశ్రీ కార్డుల స్థానంలో ఎన్టీఆర్ ఫొటో ఉన్న కార్డులు జారీ చేయనున్నారు. వాటిలో ఆధార్ నెంబర్ ను కూడా పొందుపరచాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రస్తుతం ఈ పథకంలో భాగంగా 938 రకాల చికిత్సలు అందిస్తుండగా, తాజాగా వాటికి మరో 100 చికిత్సలను జోడించారు. అదనంగా చేర్చిన చికిత్సల్లో గుండె, మూత్రపిండాలు, క్యాన్సర్ సంబంధింత చికిత్సలున్నాయి. దాంతోపాటు, ఓ కుటుంబానికి చికిత్స వ్యయపరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచారు.

  • Loading...

More Telugu News