: అనర్హత వేటును ఎదుర్కోబోతున్న తొలి సీఎం జయ... పదేళ్ల పాటు పోటీకి కూడా దూరం
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితంలో విజయాలూ సంచలనమే... పరాజయాలు కూడా సంచలనమే. ఆమె జీవితమే సంచలనాల మయం. అత్యధిక మెజారిటీతో తమిళ ప్రజలు ఆమెకు ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టినప్పటికీ... ఇప్పుడు విధిలేని పరిస్థితుల్లో ఆమె సీఎం పదవిని కోల్పోనున్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం జైలు శిక్ష పడిన జయ ముఖ్యమంత్రి పదవిని కోల్పోవడంతో పాటు ఎమ్మెల్యేగా కూడా అనర్హులవనున్నారు. అంతేకాకుండా, మరో పదేళ్ల పాటు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధాన్ని ఎదుర్కోనున్నారు. అనర్హత వేటు పడి... సీఎం పదవిని కోల్పోయిన తొలి ముఖ్యమంత్రిగా జయలలిత భారతదేశ చరిత్ర పుటల్లోకి ఎక్కబోతున్నారు.