: తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలి: సుబ్రహ్మణ్యస్వామి
తమిళనాడులో ఇంతవరకు అరాచక పాలన సాగిందని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి అభిప్రాయపడ్డారు. అత్యున్నతమైన ముఖ్యమంత్రి స్థాయి పదవుల్లో ఉండే వ్యక్తులు తప్పుడు పనులు చేయడం, శిక్షకు గురవడం సిగ్గుచేటని అన్నారు. తమిళనాడులో మావోయిస్టులు, ఐఎస్ఐఎస్, ఎల్టీటీఈ, సంఘవిద్రోహశక్తుల ప్రాబల్యం ఉందని కేంద్ర ప్రభుత్వానికి ఎన్ఐఏ నివేదిక అందించిందని... ఇది అత్యంత ఆందోళన కలిగించే అంశమని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమిళనాడులో రెండు నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తాను కోరుతున్నానని సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు.