: జయకు నాలుగేళ్ల జైలు శిక్ష... రూ. 100 కోట్ల జరిమానా


అక్రమాస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం శిక్షను ఖరారు చేసింది. ఈ మధ్యాహ్నం జయను దోషిగా ప్రకటించిన కోర్టు... కాసేపటి క్రితం ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. దీంతోపాటు, రూ. 100 కోట్ల జరిమానా విధించింది. శిక్షాకాలాన్ని 6 నెలలకు మించకుండా విధించాలని జయ తరపు న్యాయవాది చేసిన విన్నపాన్ని కోర్టు తిరస్కరించింది. జయతో పాటు ఈ కేసులో నిందితులైన శశికళ, ఇలవరసి, సుధాకరన్ లకు కూడా నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. 10 కోట్ల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

  • Loading...

More Telugu News