: ఎట్టకేలకు బంగ్లా ఖాళీ చేసిన అజిత్ సింగ్


ఢిల్లీ తుగ్లక్ రోడ్డులోని ప్రభుత్వ బంగ్లాను విమానయాన శాఖ మాజీ మంత్రి, ఆర్ ఎల్ డీ అధినేత అజిత్ సింగ్ ఖాళీ చేశారు. పట్టణాభివృద్ధి శాఖ అధికారుల సమాచారం ప్రకారం, సింగ్ తన వస్తువులన్నింటినీ తీసుకుని వెళ్లిపోయారని, ఇంటిని అధికారికంగా ప్రభుత్వానికి అప్పగించారని తెలుస్తోంది. "సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ ఆ బంగ్లాను స్వాధీనం చేసుకుంది. త్వరలో బంగ్లా పునర్నిర్మాణ పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది" అని ఆ శాఖ అధికారి ఒకరు చెప్పారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన అజిత్ గత ప్రభుత్వం కేటాయించిన ఆ బంగ్లాలోనే ఉంటున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఖాళీ చేయమని నోటీసు ఇచ్చినా ఖాతరు చేయలేదు. ఖాళీ చేయిద్దామని అధికారులు వెళ్లినప్పటికీ తన మద్దతుదారులతో ఎదుర్కొన్నారు. చివరికి ఆయన ఇంటికి నీరు, విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు. అటు ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఖాళీ చేయాల్సిందేనని హెచ్చరించింది. మరోవైపు ఆ బంగ్లాను మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ స్మారక భవనంగా మార్చాలని ఆర్ ఎల్ డీ మద్దతుదారులు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News