: తమిళనాడులో తీవ్ర ఉద్రిక్తత...పార్టీల ఆసక్తి


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం దోషిగా నిర్థారించడంతో ఆ రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. హోసూరు ప్రాంతంలో డీఎంకే, అన్నాడీఎంకే కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి. తీర్పు మధ్యాహ్నానికి వెలువడనున్న నేపథ్యంలో డీఎంకే నాయకుడు స్టాలిన్ తన తండ్రి కరుణానిధితో సమావేశం అవుతున్నారు. తీర్పు తరువాత ఎలా స్పందించాలన్న దానిపై వారు సమాలోచనలు చేస్తున్నారు. తమిళనాడులోని రాజకీయ పార్టీలన్నీ తీవ్ర ఉత్కంఠతో న్యాయస్థానం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాయి. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా లక్ష మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. తమిళనాట పురట్చితలైవిగా మన్ననలందుకుంటున్న జయలలిత 'అమ్మ' పేరిట చేపట్టిన కార్యాక్రమాలు విపరీతమైన ప్రజాదరణ పొందాయి. ఈ నేపథ్యంలో జయలలిత కోసం ప్రాణత్యాగానికైనా ఆమె అభిమానులు వెనుకాడరు. ఈ నేపథ్యంలో తమిళనాట పూర్తిగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థంకాక తీవ్ర ఉత్కంఠ రేగుతోంది.

  • Loading...

More Telugu News