: 1993 ముంబయి పేలుళ్ల నిందితుడి మరణశిక్షపై స్టే
సుప్రీంకోర్టు తాజాగా మరో నిందితుడి మరణశిక్షపై స్టే ఇచ్చింది. 1993 ముంబయి పేలుళ్ల కేసులో నిందితుడు యాకుబ్ అబ్దుల్ మెమన్ కు విధించిన ఉరిశిక్షపై స్టే ఇస్తున్నట్లు తెలిపింది. అంతేగాక తనకు విధించిన శిక్షఫై బహిరంగ కోర్టులో విచారణ జరిపించాలంటూ అతను దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు పంపింది. ఈ మేరకు అతను చేసుకున్న అభ్యర్ధనపై ప్రభుత్వ స్పందనను తెలపాలని జస్టిస్ టీఎస్ ఠాకుర్ ఏకసభ్య ధర్మాసనం ఆదేశించింది.