: అమ్మ జైలు కెళ్తే...తమిళనాట ఎవరు?
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లాల్సి వస్తే పరిస్థితి ఏంటి? అనే సందేహం అందర్నీ పట్టి పీడిస్తోంది. తమిళనాట పూర్తి మెజారిటీ ఉన్న జయలలిత జైలుకెళ్లాల్సి వస్తే...ముఖ్యమంత్రి పీఠంపై ఇంకొకర్ని కూర్చోబెట్టేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసినట్టు సమాచారం. ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించేందుకు జయలలిత దృష్టిలో అన్నాడీఎంకే నేతల్లో ముగ్గురు ఉన్నట్టు తెలుస్తోంది. రవాణా శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ, రెవెన్యూ మంత్రి పన్నీర్ సెల్వం, మాజీ ఐఏఎస్ అధికారిణి షీలా బాలకృష్ణన్ లు అమ్మకు అత్యంత నమ్మకస్తులని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో వీరు ముగ్గురిలో ఎవరిని అదృష్టం వరించనుందో అని పార్టీ నేతలు చెవులుకొరుక్కుంటున్నారు. రేసులో బాలాజీ కంటే సెల్వం, షీలాలకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.