: పెద అవుటపల్లి కాల్పుల కేసులో 15 మంది విచారణ


కృష్ణా జిల్లా పెద అవుటపల్లిలో ముగ్గురిని కాల్చి చంపిన కేసులో కీలక సాక్ష్యాధారాలు సేకరించామని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం అణువణువు గాలిస్తున్నామని డీసీపీ చెప్పారు. నిందితుల బంధువుల ఇళ్లలో సోదాలు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు. ఈ సోదాల్లో 15 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిలో ఆరుగురికి ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. కాగా, కాల్పుల్లో మృతి చెందిన ముగ్గురికి పోస్టుమార్టం పూర్తి చేసి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా పినకమిడిలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. గత మూడు రోజులుగా ఈ గ్రామంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఈ గ్రామంలో పోలీసులు 15 రోజుల పాటు 144 సెక్షన్ విధించారు.

  • Loading...

More Telugu News