: బందరు పోర్టు, నాలుగు లేన్ల రోడ్డు పనులు త్వరలో ప్రారంభిస్తాం: కొనకళ్ల
బందరు పోర్టు, విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం పనులు తొందర్లోనే మొదలవుతాయని ఎంపీ కొనకళ్ల నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, బందరు పోర్టు పనులకు భూసేకరణే అడ్డంకిగా మారిందని అన్నారు. మూడు లేక నాలుగు నెలల్లో అడ్డంకులను పరిష్కరించి పోర్టు పనులు ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి నుంచి మచిలీపట్నం వరకు జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం సహాయం కోరతామని ఆయన చెప్పారు. బెజవాడ నుంచి బందరు వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి తొందర్లోనే టెండర్లు పిలుస్తామని ఆయన వెల్లడించారు.