: రజనీకి సినిమా చూపించేందుకు రెడీ: 'మై హూ రజనీకాంత్' దర్శకుడు
తన సినిమా టైటిల్ వివాదం లేదని వివాదాస్పదమైన 'మై హూ రజనీకాంత్' సినిమా దర్శకుడు ఫైజల్ సైఫ్ తెలిపారు. ముంబైలో ఆయన మాట్లాడుతూ, తన సినిమాను సూపర్ స్టార్ రజనీకాంత్ కు, మద్రాస్ హైకోర్టుకు చూపించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. సినిమాకు, రజనీకాంత్ వ్యక్తిగత ప్రతిష్ఠకు ఎలాంటి సంబంధం లేదని ఫైజల్ సైఫ్ తెలిపారు. సినిమా చూస్తే కదా వివాదముందో లేదో తెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.