: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించండి... గవర్నర్ ను కోరిన బీజేపీ
మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ పదిహేనళ్ల బంధం తెగిపోవడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వంలో అస్థిరత నెలకొంది. ఈ కారణంతో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ తాజాగా ఆ పార్టీ నేతలు గవర్నర్ విద్యాసాగర్ రావును కలసి కోరినట్టు సమాచారం. ఈ అంశంపై, వెంటనే దృష్టి సారించిన గవర్నర్... అక్టోబర్ 15న ఎన్నికలు జరగబోతుండగా రాష్ట్రపతి పాలన ఎలా విధించాలా? అని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. చాలా ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రంలో బీజేపీ-శివసేన, కాంగ్రెస్-ఎన్సీపీలు తమ దోస్తీని కటీఫ్ చేసుకున్నాయి.