: ఆసియా క్రీడల స్క్వాష్ ఫైనల్స్ లో భారత్ జోడి
భారత జోడీ దీపికా పల్లికల్, జోష్న చిన్నప్ప ఆసియా క్రీడల స్క్వాష్ డబుల్స్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లారు. సెమీ ఫైనల్స్ లో దక్షిణ కొరియా జట్టును 2-0 తేడాతో ఓడించి ఫైనల్స్ లో భారత్ కు పతకం ఖాయం చేశారు. ఫైనల్స్ లో మలేసియా జట్టుతో దీపికా జోడీ పోటీపడనుంది. ఇందులో గెలిస్తే భారత్ కు మరో స్వర్ణం దక్కుతుంది.