: పుస్తకావిష్కరణపై తెలంగాణ వాదుల దాడి... పలువురికి గాయలు
పరకాల ప్రభాకర్ రాసిన 'రుజువులు లేని ఉద్యమం' పుస్తకావిష్కరణ హైదరాబారద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఇది తెలంగాణ ఉద్యమాన్ని కించపరుస్తూ రాసిన విషపు రచనగా పేర్కొంటూ తెలంగాణ వాదులు పుస్తకావిష్కరణను అడ్డుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు. పోలీసులు వీరిని నియంత్రించడంలో విఫలమయ్యారు. దీంతో ఆందోళన కారులు రెచ్చిపోయి అక్కడి అద్దాలను ధ్వంసం చేయగా.. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. రచయిత ప్రభాకర్ పై కూడా దాడికి యత్నించారు.