: కౌంటీల్లో సత్తా చాటిన పుజారా


భారత యువ కెరటం చటేశ్వర్ పుజారా కౌంటీ మ్యాచ్ లో తన సత్తా చాటాడు. డెర్బీషైర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న పుజారా కౌంటీల్లో తొలి శతకాన్ని (100 నాటౌట్) సాధించాడు. లీసెస్టర్ షైర్ తో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్ లో పుజారా అండతో మరో రోజు మిగిలి ఉండగానే డెర్బీషైర్ విజయాన్ని అందుకుంది. పుజారాతో పాటు ఓపెనర్ బెన్ స్లేటర్ కూడా సెంచరీ (119) సాధించాడు. 521 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లీసెస్టర్ షైర్ కేవలం 112 పరుగులకే కుప్పకూలింది.

  • Loading...

More Telugu News