: ప్లాన్ లండన్ లో... అమలు విజయవాడ-ఏలూరు హైవేపై!


ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన విజయవాడ-ఏలూరు హైవేపై జరిగిన కాల్పుల ఘటనలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. కాల్పుల ఘటనకు సంబంధించిన కుట్రదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించడంతో చాలా విషయాలు వెలుగు చూశాయి. జేకే ప్యాలెస్ అధినేత దుర్గారావు హత్యకు ప్రతీకారంగా, ప్రొఫెషనల్ కిల్లర్స్ తో 3 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. విజయవాడ-ఏలూరు హైవేపై జరిపిన కాల్పుల్లో కిల్లర్స్ 0.32 రివాల్వర్ ను వినియోగించినట్టు పోలీసులు తెలిపారు. లండన్ లో ఉంటున్న దుర్గారావు బంధువు, తన అనుయాయుల సాయంతో ప్రత్యర్థుల కదలికలపై నిఘా ఉంచి పథకం ప్రకారం హత్యలు చేయించినట్టు తెలుస్తోంది. కాగా, హంతకుల ఆచూకీపై సమాచారం లేదు.

  • Loading...

More Telugu News