: దేశంలో వ్యవసాయరంగం కుదేలైంది: మోడీ
దేశంలో వ్యవసాయరంగం కుదేలయిందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఇలా ఎందుకు జరిగిందో తనకు కూడా అర్థం కావట్లేదని అన్నారు. దేశంలోని వ్యవసాయదారులు తమపై తామే నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వశక్తిపై నమ్మకం పోతే నిలబెట్టడం కష్టమని మోడీ అన్నారు. ఓ విషవలయంలో రైతులు ఇరుక్కుపోయారని మోడీ వ్యాఖ్యానించారు. దీనిని ఛేదించాల్సిన అవసరం ఉందన్నారు.