: ఆసియా క్రీడల్లో క్వార్టర్స్ కు చేరిన సైనా... నిరాశపరిచిన సింధు
ఇంచియాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత బ్యాండ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ దూసుకుపోతోంది. మహిళల సింగిల్స్ లో ఇరాన్ క్రీడాకారిణి సొరయాను (2-0) 21-7, 21-6 తేడాతో ఘోరంగా ఓడించి క్వార్టర్ ఫైనల్స్ కు చేరింది. అటు పదవ ర్యాంకర్ క్రీడాకారిణి పీవీ సింధు నిరాశపరిచింది. 34వ ర్యాంకు క్రీడాకారిణి మనుపుట్టి బెల్లాట్రిక్స్ చేతిలో ఓడిపోయింది. తొలి గేమ్ ను 22-20 తేడాతో 19 నిమిషాల్లో గెలిచిన సింధు, తర్వాత రెండు గేమ్స్ లో 16-21, 20-22 తేడాతో వెనుదిరిగింది.