: గూగుల్ ను విశాఖకు తీసుకురావడంలో చంద్రబాబు సఫలం... ఈనెల 29న ఎంవోయు


విశాఖను ఐటీ హబ్ గా మారుస్తానని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పలుమార్లు ప్రకటించిన చంద్రబాబునాయుడు ఆ దిశగా తన ప్రయత్నాలను తీవ్రస్థాయిలో చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, విశాఖను మెగా ఐటీ హబ్‌గా మార్చాలనే ఆయన కల సాకారం అయ్యేటట్టు కనపడుతోంది. ఇప్పటికే విప్రో, టెక్ మహీంద్రా లాంటి జెయింట్ కంపెనీలు విశాఖలో తమ కంపెనీ ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు వస్తే తప్ప విశాఖలో ఐటీ రంగం అభివృద్ధి చెందదని ఐటీ నిపుణులు సలహా ఇచ్చిన నేపథ్యంలో... విప్రో, టెక్ మహీంద్రా లాంటి కంపెనీలు ఏం కోరినా రాష్ట్ర ప్రభుత్వం కాదనకుండా ఇచ్చేస్తోంది. ఇప్పుడు ఏకంగా ప్రపంచాన్ని శాసిస్తున్న ఐటీ దిగ్గజం గూగుల్‌ ను విశాఖకు రప్పించడంలో చంద్రబాబు సఫలమైనట్టు తెలుస్తోంది. ఈ నెల 29న విశాఖలో చంద్రబాబునాయుడు ఐటీ కంపెనీలతో నిర్వహించే సమావేశానికి గూగుల్‌ ప్రతినిధులు కూడా హాజరవుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఆ రోజున విశాఖలో గూగుల్‌ ఏర్పాటు చేయబోయే కార్యాలయంపై ఆ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఎంఓయూ (మెమొరాండమ్‌ ఆఫ్‌ అండర్‌స్టాండింగ్‌) జరగనుంది. గూగుల్ సంస్థ విశాఖలో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే, మెగా ఐటీ హబ్ గా ఆ నగరం మారడం ఖామయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News