: ఉమ్మడి రాష్ట్రంలో రూ.1.40 లక్షల కోట్ల విలువైన వక్ఫ్ భూములు అన్యాక్రాంతం!


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.1.40 లక్షల కోట్ల విలువ చేసే 80 వేల ఎకరాల వక్ఫ్ భూములు అన్యాక్రాంతమయ్యాయి. దీనిపై అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ ప్రభుత్వాలు విచారణ జరపని పక్షంలో తాము సీబీఐ విచారణ కోరతామంటూ తాజాగా ‘ది ఆంధ్రప్రదేశ్ మైనారిటీస్ కమిషన్’ బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. వక్ఫ్ బోర్డు మునుపటి పాలకవర్గం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలపై దర్యాప్తు జరగని వైనంపై కమిషన్ కు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కమిషన్ తాజాగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపై దర్యాప్తునకు ఆదేశించని పక్షంలో సుప్రీంకోర్టును ఆశ్రయించడం మినహా తమకు ప్రత్యామ్నాయ మార్గమేదీ కనిపించడం లేదని కమిషన్ ఛైర్మన్ అబిద్ రసూల్ ఖాన్ వాదిస్తున్నారు. గడచిన 22 ఏళ్ల కాలంలో వక్ఫ్ భూములకు ఎన్ఓసీలు, లీజుల జారీ సహా మొత్తం వక్ఫ్ బోర్డు కార్యకలాపాలపై దర్యాప్తు జరపాలని కమిషన్ డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో కేంద్ర హోం శాఖతో పాటు జాతీయ మైనారిటీ హక్కుల కమిషన్ ను కూడా తాము ఆశ్రయించనున్నట్లు ఖాన్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News