: 'రుజువులు లేని ఉద్యమం' పుస్తకంపై తెలంగాణ వాదుల ఆగ్రహ జ్వాల


తెలంగాణ ఉద్యమం గురించి మాజీ బీజీపీ, పీఆర్సీ నేత పరకాల ప్రభాకర్ రాసిన రుజువులు లేని ఉద్యమం తెలంగాణ వాదులలో ఆగ్రహజ్వాలలను రగిలించింది. ప్రభాకర్ రాసిని ఈ పుస్తకాన్ని విశాలాంధ్ర మహాసభ ఈ రోజు హైదరారాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు. ఈ విషయం తెలుసుకున్న ఉస్మానియా విద్యార్థుల జేఏసీ, తెలంగాణ అడ్వకేట్ జేఏసీ ఆధ్వర్యంలో భారీ గా తెలంగాణ వాదులు అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు. లోపలున్న ప్రభాకర్ ఇతరులపై దాడికి ఉపక్రమించారు. వీరిని పోలీసులు బయటే అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ వాదులు అక్కడున్న ఫర్నిచర్ ను, ప్రెస్ క్లబ్ అద్దాలను ధ్వంసం చేశారు. పుస్తక ప్రతులను దహనం చేశారు. ఈ పుస్తకంపై తెలంగాణ జర్నలిస్టులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ వాదుల 101 అబద్దాలు.. వక్రీకరణలు ఉపశీర్షికతో, రుజువులు లేని ఉద్యమం పేరుతో ప్రభాకర్ ఈ పస్తకాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. పుస్తకావిష్కరణ అనంతరం, తెలంగాణ వాదుల ఆందోళన నేపథ్యంలో రచయిత ప్రభాకర్ మాట్లాడుతూ.. ఉద్యమం కోసం అమయాకులను బలిపీఠంపై పెడుతూ రాజకీయ నాయకులు ఆడుతున్న డ్రామాగా వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News