: 'ఐ ఫోన్' కోసం గర్ల్ ఫ్రెండ్ ను షేర్ చేసుకుందాం అంటూ ఆఫర్


సాంకేతిక విప్లవం యువతను ఎంతగా పెడదోవ పట్టిస్తుందో తెలియచెప్పే సంఘటనలు విస్తుగొలుపుతున్నాయి. తన చెల్లిని లవ్ చేయాలంటే తనకు ఐఫోన్ 6 కొనివ్వాలని ఇటీవలే మన దేశంలో ఓ అన్న డిమాండ్ చేస్తే... చైనాలో ఓ యువకుడు ఐఫోన్ 6 కొనుక్కునేందుకు ఏకంగా తన గర్ల్ ఫ్రెండ్ ను షేర్ చేసుకుందాం రండి అంటూ నడిరోడ్డుపై ప్లకార్డు పట్టుకుని ప్రకటించాడు. మొబైల్ ఫోన్లకు యువత బానిసలుగా మారిపోతున్నారు. ఫోన్ లేనిదే ఉండలేనంత దీనావస్థకు దిగజారిపోతున్నారు. అవసరానికి వాడుకోవాల్సిన ఫోన్ సాంగత్యంలోనే నిత్యం గడుపుతూ మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు. ఐఫోన్ 6ను కొనుక్కునేందుకు డబ్బుల్లేని ఆ యువకుడు తన గర్ల్ ఫ్రెండ్ తో గడపాలంటే తనకు డబ్బులు చెల్లించాలని షరతులు పెట్టాడు. తన గర్ల్ ఫ్రెండ్ తో కలసి భోజనం చేసేందుకోరేటు, చదువుకునేందుకో రేటు, గేమ్స్ ఆడుకునేందుకో రేటు, డేటింగ్ కో రేటు ఫిక్స్ చేశాడు. అయితే అసభ్యంగా ప్రవర్తించడానికి మాత్రం ఒప్పుకోనని తెగేసి చెబుతున్నాడు. తన గర్ల్ ఫ్రెండ్ నుంచి ఈ సౌకర్యాలు పొందేందుకు గంటకు 100, నెలకు 5 వేలు చెల్లించాలని షరతులు విధించాడు. ఈ విషయంలో తన గర్ల్ ఫ్రెండ్ కు కూడా అభ్యంతరం లేదని ఆ యువకుడు ప్లకార్డులో తెలిపాడు. ఫోన్ కొనడానికి గతిలేక గర్ల్ ఫెండ్ ను అమ్మకానికి పెట్టిన యువకుడితో ఆమె ఎలా వేగుతుందో మరి?

  • Loading...

More Telugu News