: నిలకడగా నటుడు శశికపూర్ ఆరోగ్య పరిస్థితి
బాలీవుడ్ నటుడు శశికపూర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈరోజు లేదా రేపు ఆయనను డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. కపూర్ కుమారుడు కునాల్ కపూర్ మాట్లాడుతూ, తండ్రి కోలుకుంటున్నారని, ప్రస్తుత పరిస్థితి స్థిరంగా ఉందనీ అన్నారు. చెస్ట్ ఇన్ఫెక్షన్ కారణంగా ఈ నెల 21న కపూర్ ఆసుపత్రిలో చేరారు. మరోవైపు ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని నటుడు అమితాబ్ బచ్చన్ ప్రార్థించారు.