: దసరాలోపు తెలంగాణలో హోంగార్డులకు జీతాలు: మంత్రి నాయిని


మూడు నెలలుగా జీతాలు అందుకోని తెలంగాణ హోంగార్డులకు త్వరలో వేతనాలు ఇస్తామని హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి తెలిపారు. దసరా పండుగలోపు జీతాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ మేరకు మాట్లాడిన ఆయన, హోంగార్డులను ఆదుకుంటామని ఉద్యమం సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని, దాన్ని నెరువేరుస్తామనీ అన్నారు. ఇప్పటికే వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పోలీసుల తరహాలోనే రెగ్యులర్ గా జీతాలు వచ్చేలా ఆర్థిక మంత్రితో మాట్లాడామని, బడ్జెట్ లో కూడా ఈ విషయాన్ని పొందుపరుస్తామనీ అన్నారు.

  • Loading...

More Telugu News