: అక్కడ మహిళకు మిస్డ్ కాల్ ఇస్తే జైలే గతి!
బీహార్లో సరికొత్త పోలీసింగ్ కు తెరదీశారు. ఇకపై అపరిచితులెవరైనా మహిళలకు మిస్డ్ కాల్ ఇస్తే అతడిపై క్రిమినల్ కేసు దాఖలు చేస్తారు. మిస్డ్ కాల్ ఇచ్చిన వ్యక్తి పురుషుడై ఉండి, అతడు క్రిమినల్ ఉద్దేశంతో ఆ కాల్ చేశాడని భావిస్తే, ఆ వ్యక్తిపై కేసు నమోదు చేస్తామని సీఐడీ ఐజీ అరవింద్ పాండే తెలిపారు. ఈ మేరకు అన్ని జిల్లాల ఎస్పీ కార్యాలయాలకు సర్క్యులర్లు పంపారు. తనకు ఓ వ్యక్తి మిస్డ్ కాల్ ఇచ్చాడని మహిళ ఫిర్యాదు చేస్తే చాలని, మిగతా విషయాలు తాము చూసుకుంటామని బీహార్ పోలీసులు అంటున్నారు. ఈ మేరకు మహిళలకు రక్షణ కలిగించే చట్టాలు, వాటి ప్రయోజనాల గురించి ప్రచారం చేసేందుకు అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు.