: అబ్బో... మామ్ సూపర్ ఫాస్ట్... అప్పుడే అంగారకుడి తొలి ఫొటో పంపేసింది!


మంగళ్ యాన్ ప్రయోగం విజయవంతం అయిన తర్వాత మామ్ లోని కెమెరా తీసిన అంగారక గ్రహ కలర్ ఫొటోలు ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు అందుతాయని ఇస్రో శాస్త్రవేత్తలు భావించారు. కానీ, అందరినీ ఆశ్చర్యపరుస్తూ పదిన్నర కల్లా మామ్ అంగారక గ్రహం తొలి ఫొటోను బెంగుళూరులోని ఇండియన్ డీప్ స్పేస్ నెట్ వర్క్ కు పంపింది. మరికొద్ది సేపట్లో మామ్ నుంచి అంగారక గ్రహం కలర్ ఫొటోలు మరిన్ని రానున్నాయని ఇండియన్ డీప్ స్పేస్ నెట్ వర్క్ అధికారులు చెబుతున్నారు. ఈ ఫొటోల ద్వారా అంగారక గ్రహంపై వాతావరణ పరిస్థితులు, జీవరాశుల ఉనికిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తారు.

  • Loading...

More Telugu News