: నేడు ఢిల్లీ వెళుతున్న కేటీఆర్


తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ఈరోజు ఢిల్లీ వెళుతున్నారు. చేనేత, జౌళి పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల సంక్షేమంపై ఢిల్లీలో జరగనున్న రాష్ట్రాల చేనేత, జౌళి శాఖ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా తెలంగాణలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ వివరించనున్నారు. ఈ భేటీ అనంతరం కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ, రవిశంకర్ ప్రసాద్ లతో కేటీఆర్ సమావేశమవుతారు. సాయంత్రం 4 గంటలకు వెంకయ్యనాయుడుతో భేటీ అయి రాష్ట్రంలో పట్టణాభివృద్ధి శాఖ సమస్యలపై చర్చిస్తామని కేటీఆర్ తెలిపారు. రేపు కూడా ఆయన ఢిల్లీలోనే మకాం వేసే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News