: కరవులోనూ బాస్మతి సాగులో పంజాబీల సాహసం!


పంజాబ్ లో కరవు విలయతాండవం చేస్తోంది. తక్షణమే రూ. 2,330 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ కేంద్రాన్ని శరణుజొచ్చారు. అయితే రాష్ట్రంలో బాస్మతి వరిని పండించే ప్రాంతాల్లో పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. గతేడాది కంటే ఏకంగా 30 శాతం బాస్మతి సాగు విస్తీర్ణం పెరిగింది. దీంతో గతేడాది కంటే 11.35 లక్షల అధిక దిగుబడిని పంజాబీ రైతులు సాధించనున్నారు. తత్ఫలితంగా బాస్మతి బియ్యం ధరను దిగొచ్చేలా చేయనున్నారు. కరవు పరిస్థితుల్లోనే ఈ తరహా సాగు ఎలా సాధ్యమైందనేగా మీ అనుమానం. వర్షం కురవకపోతేనేం, బావుల్లో నీరుంది కదా అన్న ధీమాతో సాగులోకి దిగిన గుర్దాస్ పూర్, తరన్ తరన్, జలాలాబాద్ రైతులు, కేవలం డీజిల్ కోసమే రూ. 850 కోట్లు వెచ్చించారట. బాస్మతిపై ఎంత నమ్మకం లేకపోతే మాత్రం రైతులు అంత సాహసం చేస్తారు చెప్పండి. అందుకే బాదల్ ప్రభుత్వం వారికి బాసటగా నిలుస్తోంది. కరవు పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతన్న రాష్ట్రానికి ఆర్థిక సాయం ప్రకటించడంతో పాటు బాస్మతికి కనీస మద్దతు ధర లభించేలా చర్యలు చేపట్టాలని ఒత్తిడి తెస్తోంది.

  • Loading...

More Telugu News