: ఉక్రెయిన్ రాజకీయ నాయకురాలి నగ్న చిత్రాలు నెట్ లో ప్రత్యక్షం!


ఉక్రెయిన్ రాజకీయ నాయకురాలు ఓల్గా ల్యూన్చాక్ నగ్న చిత్రాలు నెట్ లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఆ దేశంలో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే 30 ఏళ్ల వయసులో పార్లమెంట్ బరిలో దూకేందుకు సిద్ధంగా ఉన్న ఓల్గా మాత్రం ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారు. ఐక్లౌడ్ హ్యాకర్ చేసిన పాపానికి తాను బాధపడేదేమీ లేదని చెప్పేశారు. అంతటితో ఆగని ఆమె, దీనిపై తానేమీ సిగ్గు పడటం లేదని కూడా కుండబద్దలు కొట్టారు. అయినా ప్రముఖుల పెయింటింగ్స్ లోని నగ్న మహిళల ఛాయాచిత్రాలకు, నెట్ లో కనిపించిన తన చిత్రాలకు పెద్ద తేడా ఏమీ లేదని కూడా చెప్పుకొచ్చారు. ప్రముఖుల ఛాయాచిత్రాల్లోని నగ్నత్వాన్ని కీర్తించే జనం, మహిళలు నగ్నంగా కనిపిస్తే మాత్రం ఎందుకు ఏవగించుకుంటారో అర్థం కాదని కూడా ఆమె వ్యాఖ్యానించారు. మహిళల నగ్నదేహాన్ని కళాత్మక రూపంగా ఆమె అభివర్ణించారు.

  • Loading...

More Telugu News