: మూడేళ్ల బాలుడికి పోలీసుల సమన్లు!


సంచలనాలకు నిలయం ఉత్తరప్రదేశ్. అది ఏ విషయమైనా కావచ్చు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడని మూడేళ్ల బాలుడికి సమన్లు జారీ చేసి, సంచలనం రేపారు యూపీ పోలీసులు. ఇదే తొలిసారేమీ కాదనుకోండి. గతంలోనూ ఏడాది వయసున్న బాలుడికి సమన్లు జారీ చేసిన మొరాదాబాద్ పోలీసులు తాజాగా మూడేళ్ల బాలుడిని నిందితుడిగా తేల్చారు. పోలీసుల సమన్ల నుంచి ఉపశమనం పొందాలంటే ఆ బాలుడు రూ. 50 వేల పూచీకత్తు ఇవ్వాల్సి ఉంది. అసలు విషయమేంటంటే, మొరాబాద్ జిల్లాలోని స్వాలా గ్రామంలోని ఓ రేషన్ షాపు నుంచి కిరోసిన్ ను గ్రామ పెద్దలు అక్రమంగా తరలించడాన్ని గ్రామానికి చెందిన ఇంద్రీస్ అనే వ్యక్తి గుర్తించారు. గ్రామ పెద్దలు చేస్తున్న పని అక్రమమని నిలదీశాడు. అంతే ఇంద్రీస్ తో పాటు, ఆయన కొడుకు, మూడేళ్ల మనవడితో కలిపి మొత్తం కుటుంబంలోని మగాళ్లందరికీ పోలీసుల నుంచి సమన్లు జారీ అయ్యాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని సదరు సమన్లలో పోలీసులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News