: కోర్టుకు హాజరైన జగన్... విచారణ ప్రారంభం
అక్రమాస్తుల కేసులో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు హైదరాబాదులోని నాంపల్లి సీబీఐ కోర్టులో హాజరయ్యారు. ఈ మేరకు విచారణ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, మాజీ అధికారులు రాజగోపాల్, మన్మోహన్ సింగ్ తదితరులు కూడా కోర్టుకు వచ్చారు. ఇక, మాజీ మంత్రులు ధర్మాన, సబిత తాము విచారణకు హాజరుకాలేమని విడివిడిగా కోర్టులో పిటిషన్ లు వేశారు.