: గంగానది ప్రక్షాళనకు 18 ఏళ్లు పడుతుంది... సుప్రీంకు తెలిపిన కేంద్రం
పవిత్ర గంగానది ప్రక్షాళనకు పద్దెనిమిదేళ్లు పడుతుందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ సమయంలో వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చవుతాయని చెప్పింది. ఈ మేరకు రూపొందించిన బృహత్ ప్రణాళికను కోర్టుకు సమర్పించింది. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక చర్యలతో తయారుచేసిన నమూనా ప్రణాళికను అఫిడవిట్ రూపంలో ఇచ్చింది. నదీ తీరం వెంబడి 2,500 కిలోమీటర్ల పొడవునా 118 పట్టణాల్లో సంపూర్ణస్థాయిలో పారిశుద్ధ్య పరిస్థితులను నెలకొల్పడం తమ మొదటి లక్ష్యమని ప్రభుత్వం ఈ సందర్భంగా వివరించింది.