: ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ అద్భుతంగా ఉంది: బాబు
ఛత్తీస్ గఢ్ రాజధాని నయా రాయ్ పూర్ నిర్మాణం అద్భుతంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. నయా రాయ్ పూర్ లో ఆయన మాట్లాడుతూ, రాజధాని నయారాయ్ పూర్ లో భూసేకరణ తనను విపరీతంగా ఆకర్షించిందని అన్నారు. రైతులకు నష్టం కలుగకుండా సిటీ నిర్మాణం అందరికీ ఆదర్శప్రాయమని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధానిలోని అనేక ప్రాంతాలను పరిశీలించామని ఆయన తెలిపారు. రాజధాని నిర్మాణం మొత్తం అధ్యయనం చేశామని ఆయన తెలిపారు. అంతకు ముందు బాబు ఛత్తీస్ గఢ్ సీఏంను శాలువతో సత్కరించగా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ బాబును సత్కరించారు.