: మోడీ అమెరికా పర్యటన షెడ్యూల్ ఇదే


భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ప్రధాని ఈ నెల 26న న్యూయార్క్ లోని జాన్ ఎఫ్ కెన్నడీ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఆయన పర్యటన సెప్టెంబర్ 30 వరకు సాగనుంది. పర్యటన వివరాలు సెప్టెంబర్ 26: అమెరికాలో అడుగుపెడతారు. సెప్టెంబర్ 27: ఐక్యరాజ్యసమితి సాధారణ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సెప్టెంబర్ 28: న్యూయార్క్ లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ లో ఇండో-అమెరికన్లను ఉద్దేశించి మాట్లాడతారు. సెప్టెంబర్ 28: భారత రాయబారి (ఐక్యరాజ్యసమితి) ఇచ్చే ప్రైవేటు విందుకు హాజరవుతారు. సెప్టెంబర్ 29: వాషింగ్టన్ డీసీ వెళ్ళి అమెరికా కాంగ్రెస్ సభ్యులను, భారత సంతతి ప్రముఖలను కలుస్తారు. సెప్టెంబర్ 29-30: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో వైట్ హౌస్ లో చర్చలు జరుపుతారు.

  • Loading...

More Telugu News