: చైనా నుంచి హాంకాంగ్ కు మారిన గూగుల్ కార్యకలాపాలు
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ చైనాలో తన కార్యకలాపాలను నిలిపివేసింది. గతేడాది డిసెంబర్ లో గూగుల్ పై చైనా సైబర్ దాడులు, సెర్చ్ సర్వీస్ లపై ఆంక్షలు, కొన్ని సున్నితమైన సెర్చ్ ఆపరేషన్ల సమాచారాన్ని ప్రభుత్వం ఫిల్టర్ చేయడం, ఇంకా అనేక కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు గూగుల్ వెల్లడించింది. అంతేగాక, చైనా నుంచి హాంకాంగ్ కు గూగుల్ తన కార్యాలయాన్ని మార్చివేసింది. ఇక నుంచి 'గూగుల్.కామ్.హెచ్ కె' పేరిట తమ కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపింది. మరోవైపు, బీజింగ్ హెడ్ క్వార్టర్స్ లోని గూగుల్ కార్యాలయం ఎదుట మద్దతుదారులు ఫ్లవర్ బొకేలు, చాకోలెట్ లతో నిరసన వ్యక్తం చేస్తున్నారు.