: విజయవాడ, తిరుపతి ప్రజలకు గుడ్ న్యూస్!
ఈ ఏడాది అక్టోబర్ రెండు నుంచి ఏపీలోని విజయవాడ, తిరుపతి నగరాలతో పాటు తొమ్మిది మున్సిపాలిటీలు, ముఫ్పై తొమ్మిది మండలాలకు కూడా నిరంతర విద్యుత్ సరఫరా చేయనున్నారు. కేంద్రంతో కుదుర్చుకున్న నిరంతర విద్యుత్ సరఫరా ఒప్పందంలో భాగంగా అక్టోబర్ రెండు నుంచి తొలి దశలో ఈ ప్రాంతాలకు నిరంతర విద్యుత్ ను సరఫరా చేస్తారు. ఆ తర్వాత, దశలవారీగా నిరంతర విద్యుత్ సరఫరాను ఆంధ్రప్రదేశ్ లోని మిగతా ప్రాంతాలకు విస్తరిస్తారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే, ఇకపై విజయవాడ, తిరుపతి లకు ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంట్ కోత విధించకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఒకవేళ, ఎప్పుడైనా పొరపాటున విద్యుత్ కొరత వచ్చినా, మిగిలిన ప్రాంతాలకు కోత విధించాలే తప్ప, ఈ రెండు నగరాలకు కరెంట్ సరఫరాను మాత్రం ఆపకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. విజయవాడను రాజధానిగా ఎంపిక చేయడం, తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం కావడంతో చంద్రబాబు సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.