: ట్విట్టర్లో అమితాబ్ తర్వాత అతడే!
మైక్రో-బ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఫాలోయర్ల సంఖ్య 9 మిలియన్లు (90 లక్షలు) దాటింది. 'బిగ్ బి' అమితాబ్ బచ్చన్ 10.4 మిలియన్ల మంది ఫాలోయర్లతో ప్రథమస్థానంలో ఉండగా, 9.2 మిలియన్లతో షారుఖ్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. 2010లో ట్విట్టర్లో ప్రవేశించిన షారుఖ్ ఇప్పటివరకు 7,718 ట్వీట్లు చేశాడు. ఇక, అమీర్ ఖాన్ కు 8.45 మిలియన్లు, సల్మాన్ ఖాన్ కు 8.26 మిలియన్ల మంది ఫాలోయర్లు ఉన్నారు.