: మంత్రి ప్రత్తిపాటి ఇంటిని ముట్టడించిన రైతులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇంటిని ఈ ఉదయం ప్రకాశం జిల్లా రైతులు ముట్టడించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని ఆయన నివాసం వద్దకు భారీగా చేరుకున్న రైతులు శనగకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ప్రకాశం జిల్లాలో 17 లక్షల క్వింటాళ్ళ శనగ పంట నిల్వ ఉందని, ఈ విషయమై 20 రోజుల క్రితం సీఎంను కలిసినా ఫలితం లేకపోయిందని మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.