: తీరం దాటిన అల్పపీడనం
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీరం దాటింది. ప్రస్తుతం ఉత్తర ఒడిశా, బెంగాల్, జార్ఖండ్ పరిసరాల్లో ఈ అల్పపీడనం కొనసాగుతోంది. అటు, ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతుండడం, రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో... కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. కాగా, తీరం వెంబడి 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రంలో వేటకు వెళ్ళే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.