: జమ్మూ కాశ్మీర్ కు తెలంగాణ సాయం
ప్రకృతి కన్నెర్ర చేయడంతో వరదలతో తల్లడిల్లిన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వం సహాయం చేసింది. జమ్మూ కాశ్మీర్ లో ఎటు చూసినా వరద నీరు నిలిచిపోవడంతో అక్కడి ప్రజలు తాగునీటి కొరత ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ కు నీటి శుద్ధి యంత్రాలను పంపించింది. సికింద్రాబాదు నుంచి రైల్లో 30 నీటి శుద్ధి యంత్రాలను జమ్మూ కాశ్మీర్ కు తరలిస్తున్నారు.