: ఇండియన్ మార్కెట్లోకి కోకా-కోలా కొత్త సాఫ్ట్ డ్రింక్ 'జీరో'
ప్రముఖ శీతల పానీయ సంస్థ కోకా- కోలా మరో కొత్త ఉత్పత్తిని ఇండియన్ మార్కెట్ లోకి విడుదల చేసింది. కోకా- కోలా 'జీరో' అనే ఈ నూతన పానీయాన్ని బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్ దేశ రాజధాని ఢిల్లీలో నిన్న విడుదల చేశారు. అలాగే, బెంగళూరులో టెన్నిస్ క్రీడాకారులు మహేశ్ భూపతి, రోహన్ బోపన్నలు 'జీరో'ను విడుదల చేశారు. కోకా- కోలా జీరో సుగర్ ఫ్రీ సాఫ్ట్ డ్రింక్ అని... దీన్ని అన్ని వయసుల వారు నిరభ్యంతరంగా త్రాగవచ్చని కోకా-కోలా ఇండియా ప్రెసిడెంట్ వెంకటేష్ తెలిపారు. ఇప్పటికే, తమ కంపెనీ థమ్స్ అప్, 'కోకా-కోలా', మాజా, మినిట్ మెయిడ్, స్ప్రైట్ లాంటి ఉత్పత్తులతో భారత్ మార్కెట్ లో దూసుకుపోతుందని...'జీరో' కూడా అదే బాటలో విజయవంతమవుతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.