: 'కుక్కతోక వంకర'...మరోసారి భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చిన చైనా దళాలు


భారత్ భూభాగంలోకి చైనా బలగాలు మరోసారి ప్రవేశించాయి. లడఖ్ లోని చుముర్ ప్రాంతంలోకి చైనా సైనిక బలగాలు ఈ ఉదయం మరోసారి చొచ్చుకువచ్చాయి. దీంతో, సరిహద్దు వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం ఉదయం... మరి కొన్ని గంటల్లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత్ లో కాలుమోపనున్నారని భారత ప్రభుత్వ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, లడఖ్ లోని చుముర్ ప్రాంతంలోకి చైనా సైనికులు చొచ్చుకువచ్చారు. అయితే, ప్రధానమంత్రి నరేంద్రమోడీ సరిహద్దు వివాదాన్ని జిన్ పింగ్ దగ్గర గట్టిగా ప్రస్తావించడంతో, చైనా ప్రభుత్వంలో కదలిక వచ్చి నిన్న తన దళాలను భారత భూభాగం నుంచి ఉపసంహరించుకుంది. మళ్లీ, 24 గంటలు కూడా పూర్తికాకముందే... 'కుక్కతోక వంకర' లాగా చైనా బలగాలు ఈ ఉదయం మళ్లీ భారత భూభాగంలోకి ప్రవేశించాయి.

  • Loading...

More Telugu News