: సింగరేణి కార్మికుల దసరా అడ్వాన్స్ పెరిగింది
సింగరేణి బొగ్గు గని కార్మికులకు దసరా పర్వదినం పురస్కరించుకుని యాజమాన్యం ఇచ్చే అడ్వాన్స్ ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో 10 నుంచి 12 వేల మధ్యలో ఇచ్చే అడ్వాన్స్ ను ఈ సారి 16 వేలకు పెంచింది. కార్మిక సంఘాలు అడ్వాన్స్ పెంచాలంటూ చేసిన డిమాండ్ మేరకు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. యాజమాన్యం నిర్ణయం పట్ల సింగరేణి కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.