: హృతిక్ రోషన్ తో నటించాలనుందా?... ఇదిగో ఛాన్స్!
మీరు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కు వీరాభిమానా? అయితే, ఆయనతో స్క్రీన్ పై తెర పంచుకునేందుకు ఇదే అవకాశం. 'మౌంటెన్ డ్యూ' అనే శీతల పానీయాల బ్రాండ్ ఈ మేరకు ఓ అవకాశం ఇవ్వబోతోంది. ఈ ఛాన్స్ తో అప్పటివరకూ సాధారణ పౌరులుగా ఉన్న వారిని హీరోలుగా మార్చనుంది. అలాంటి వారిని గుర్తించేందుకు హృతిక్ తాజా చిత్రం 'బ్యాంగ్ బ్యాంగ్'తో కలసి ఓ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. 'మౌంటెన్ డ్యూ హీరోస్ వాంటెడ్' అనే టైటిల్ తో సాగే ఈ ప్రచార కార్యక్రమంలో ముగ్గురు విజేతలను ఎంపిక చేస్తుంది. వారే హృతిక్ తో కొంతసేపు నటించే ఛాన్స్ పొందుతారు. దీనిపై హృతిక్ మాట్లాడుతూ, "ఈ అవకాశం ఈ దేశంలో యువకులను హీరోలుగా మారుస్తుంది. ఉత్సాహం ఉన్నవారు ఈ పోటీలో పాల్గొని హీరోలవ్వాలి" అని ప్రోత్సహించాడు. ఈ పోటీలో పాల్గొనాలంటే మౌంటెన్ డ్యూ బాటిల్ కొని, దాని వెనక లేబుల్ పై ఉన్న యూనిక్ కోడ్ ను ఎస్ఎంఎస్ చేయాలి. ఈ నెల 16 నుంచి అక్టోబర్ 30 వరకు ఈ పోటీ అమల్లో ఉంటుంది.