: హర్యానా అసెంబ్లీ బరిలో 15 మంది సిట్టింగ్ లకు కాంగ్రెస్ మొండిచెయ్యే!
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారాన్ని చేపట్టేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. చివరకు వచ్చే నెల 15న జరిగే ఎన్నికల్లో గెలవలేరని భావిస్తున్న 15 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లను నిరాకరించేందుకు ఆ పార్టీ అధిష్ఠానం వెనుకాడటం లేదు. ఈ మేరకు ఆ పార్టీ స్క్రీనింగ్ కమిటీ, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి నివేదించేందుకు రంగం సిద్ధం చేస్తోందట. హర్యానాలో పదేళ్ల పాటు అధికారంలో కొనసాగుతున్న భూపీందర్ సింగ్ హుడా ప్రభుత్వం ఈ దఫా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. మోడీ ప్రభంజనంతో కేంద్రంలో స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ, హర్యానాలో ఎలాగైనా ఈ దఫా అధికారం చేపట్టాల్సిందేనని భావిస్తోంది. అందుకు తగ్గట్టుగా ఇప్పటికే కార్యరంగంలోకి దిగింది. ఈ నేఫథ్యంలో బీజేపీ నుంచి కాంగ్రెస్ ఎన్నడూ లేని రీతిలో గట్టి పోటీని ఎదుర్కొంటోంది.