: చైనా మాజీ అధ్యక్షుడి కంటే ప్రస్తుత అధ్యక్షుడు చాలా బెటర్: దలైలామా
చైనా మాజీ అధ్యక్షుడు హు జింటావోతో పోలిస్తే ప్రస్తుత అధ్యక్షుడు జిన్ పింగ్ చాలా మంచివాడని టిబెట్ బౌద్ధ మత గురువు దలాలైమా వ్యాఖ్యానించారు. జిన్ పింగ్ .... హు జింటావో కంటే వాస్తవిక దృక్పథంతో ఉంటారని.. ఓపెన్ మైండ్ తో ఆలోచిస్తారని ఆయన ప్రశంసించారు. టిబెట్ సమస్య మరింత హింసాత్మక రూపు దాల్చకుండా... చర్చల ద్వారా శాంతియుతంగానే పరిష్కరించగలమని ఆయన పేర్కొన్నారు. టిబెట్ సమస్య కేవలం టిబెట్ దే అవదని... భారతదేశపు సమస్య కూడా అవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. చైనాతో టిబెట్ కున్న సమస్యను పరిష్కరించడంలో భారత్ చొరవ చూపాలని ఆయన సూచించారు. పరస్పర నమ్మకం ఆధారంగా ఇండో-చైనా సంబంధాలు మరింత బలపడాలని ఆయన ఆకాంక్షించారు.