: చైనా అధ్యక్షుడికి టిబెటన్ల నిరసన


టిబెట్ పై చైనా తీరును నిరసిస్తూ టిబెటన్లు నిరసన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీతో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో సమావేశమైన నేపథ్యంలో టిబెట్ ఆందోళనకారులు తమ నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ హౌస్ మూడవ నెంబర్ గేట్ వద్దకు చేరుకుని చైనా వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో, పోలీసులు వారిని ఆడ్డుకున్నారు. ఆందోళనకారులు ఎదురు తిరగడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. చైనా పాలన నుంచి టిబెట్ కు విముక్తి కలిగించాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News